Sun Dec 22 2024 21:24:27 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏపీ డీజీపీపై బదిలీ వేటు
ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ డీజీపీ పై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏపీ డీజీపీగా రాజేంద్ర నాధ్ రెడ్డి విధుల్లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని టీడీపీ నేతలు తరచూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ వచ్చారు.
శాంతి భద్రతలకు...
అలాగే శాంతి భద్రతలకు కూడా భంగం కలిగే అవకాశముందని తెలిపారు. నిన్న మాడగులలో జరిగిన ఘటన కూడా డీజీపీ బదిలీ వేటుకు కారణమని తెలుస్తోంది. విధుల నుంచి వెంటనే రిలీవ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం పదకొండు గంటలలోగా ముగ్గురు అధికారుల పేర్లను తమకు పంపాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
Next Story