Thu Dec 19 2024 04:18:19 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : టీడీపీపై చర్యలకు సీఈసీ ఆదేశం... వెంటనే నివేదిక ఇవ్వాలంటూ
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంలో టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంలో టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ విధానంలో ఓటర్లను తప్పుదోవ పట్టిస్తూ టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఇటీవల వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అబద్ధపు ప్రచారాలతో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
వైసీపీ ఫిర్యాదుతో...
ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తీసుకున్న చర్యల గురించి తమకు నివేదిక అందివ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. దీంతో టీడీపీపై ఎలాంటి చర్యలుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story