Thu Dec 19 2024 00:51:57 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఏపీలో పట్టుబడిన నగదు ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీగా నగదు పట్టుబడినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీగా నగదు పట్టుబడినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నగదుతో పాటు మద్యం కూడా భారీగానే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఏపీ ఎన్నికల సందర్భంగా మొత్తం 107.96 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇక అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపింది. ఈ ఎన్నికల్లో 58.70 కోట్ల రూపాయల విలువై మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ీఈసీ లెక్కల ప్రకారం...
ఎన్నికల సమయంలో నాలుగు వైపులా నిఘా ఉంచడమే కాకుండా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో 31 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మొత్తం 150 చెక్పోస్టులను ఏర్పాటు చేయగా ఇందులో 31 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టలని చెప్పింది. గత ఎన్నికలకంటే ఈసారి అత్యధికంగా నగదు, మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మరీ వీటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. వివిధ కేసుల్లో 7,305 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపింది.
Next Story