Mon Dec 23 2024 17:15:45 GMT+0000 (Coordinated Universal Time)
పోలీస్ బాస్లపై వేటు తప్పదా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడిని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడిని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. వరస వైఫల్యాలతో వీవీఐపీలకు భద్రత కరువయిందన్న అభిప్రాయం ఎన్నికల కమిషన్ లో వ్యక్తమవుతుంది. ఏకంగా ముఖ్యమంత్రిపై దాడి జరిగిందంటే.. దానికి కారణం ఎవరో నిగ్గుతేల్చాలని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. వెంటనే తమకు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆందోళనకరమైన విషయమని అభిప్రాయపడుతుంది.
ఎన్నికల కమిషన్ సీరియస్...
దీంతో ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. కొందరు పోలీస్ బాస్ లపై కూడా వేటు పడే అవకాశమున్నట్లు తెలిసింది. ఇంకా నెల రోజులు ఎన్నికలకు సమయం ఉండటంతో హింస పెరిగిపోతుందని భావించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే కొందరు పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి దాడులు ఆగవన్న అభిప్రాయానికి ఎన్నికల కమిషన్ వచ్చినట్లు తెలిసింది.
Next Story