Thu Dec 19 2024 07:01:34 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు ఐపీఎస్ లపై ఎన్నికల సంఘం వేటు
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణాను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరింది. అలాగే ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది వీరిద్దరిని ఎన్నికలకు సంబంధం లేని విధులను అప్పగించాలని సూచించింది.
ముగ్గురి పేర్లను...
వీరి స్థానంలో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురు పేర్లును పంపాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ పై రాయి దాడి కేసు జరిగిన నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగాయని పోలీసు శాఖ లో ఉన్నతాధికారులు చెప్పుకుంటున్నారు.
Next Story