Thu Dec 19 2024 04:04:38 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో అక్కడ రీపోలింగ్ కు ఆదేశాలు
ఏపీలో ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో సమస్య ఎదురైంది. ఇక్కడ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఈవీఎం బ్యాలెట్ పేపర్లను ఇచ్చారు. ఉద్యోగులు సైతం వాటిపైనే ఓట్లు వేశారు. చివర్లో విషయం తెలియడంలో విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.
పోస్టల్ బ్యాలట్ లను...
దీంతో ఇక్కడ రీపోలింగ్కు ఆదేశాలిచ్చినట్లు ఎణ్నికల కమిషన్ అధికారులు పేర్కొన్నారు. మరో రెండ్రోజుల్లో అక్కడ రీపోలింగ్ జరగనుందని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ లు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. వీటి గడువును కూడా ఈ నెల 9వ తేదీ వరకూ పెంచుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
Next Story