Mon Dec 23 2024 05:50:23 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఈ నియోజకవర్గాలే అత్యంత సమస్యాత్మకం.. అందకే అదనపు బలగాలతో...?
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాలను గుర్తించినట్లు ఎన్నికల కమిషనర్ మీనా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాలను గుర్తించినట్లు ఎన్నికల కమిషనర్ మీనా తెలిపారు. పథ్నాలుగు నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాలుగా గుర్తించి అక్కడ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మీనా తెలిపారు.
వందశాతం వెబ్‌కాస్టింగ్ ...
మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ల పల్లి నియోజకవర్గాలను సమస్యాత్మకమైన నియోజకవర్గాలుగా గుర్తించామని తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో వందశాతం వెబ్‌కాస్టింగ్ తో కూడిన పోలింగ్ కేంద్రాలుంటాయని తెలిపారు. సీఆర్పీఎఫ్ బలగాలను కూడా భారీగా దించుతామని చెప్పారు.
Next Story