Fri Nov 22 2024 16:20:44 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు.. వీటి వాడకాన్ని తగ్గించాలి !
పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్
అమరావతి : దేశంలో ఏపీ సహా 12 రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమలకు వారంలో 2-3 రోజులు పవర్ హాలిడే ప్రకటించడంతో పాటు గంటల తరబడి కరెంటు కోతలు విధిస్తున్నారు. వేసవికాలం కావడంతో విద్యుత్ డిమాండ్ సాధారణం కంటే ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడంతో విద్యుత్ కొరత నెలకొంది. దీంతో ఇళ్లల్లో విద్యుత్ వినియోగంపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించాయి.
ఏసీల వాడకాన్ని తగ్గించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంక్షలు పెట్టాయి. అలాగే నీటి మోటార్లను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు మాత్రమే వాడాలని, ఐఎస్ఐ మార్కు ఉన్న మోటార్లు, పంపులు వినియోగించాలని తెలిపాయి. అవసరమైతేనే లైట్లు ఉపయోగించాలని.. బయటకు వెళ్తే లైట్లను ఆఫ్ చేయాలని పేర్కొన్నాయి. అవసరమైతేనే లైట్లు ఉపయోగించాలని.. బయటకు వెళ్తే లైట్లను ఆఫ్ చేయాలని పేర్కొన్నాయి. వస్త్ర దుకాణాలు, సూపర్ మార్కెట్లపై కూడా విద్యుత్ వినియోగ ఆంక్షలు ఉన్నాయి. వాటిలో 50 శాతం లైట్లను మాత్రమే వినియోగించాలని, విద్యుత్ సంక్షోభం తగ్గేంతవరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి.
Next Story