Mon Dec 23 2024 14:21:38 GMT+0000 (Coordinated Universal Time)
ఘాట్ రోడ్ లోకి భారీగా ఏనుగుల గుంపు
తిరుమల ఘాట్ రోడ్ లోకి భారీగా ఏనుగుల గుంపు వచ్చింది. దీంతో భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు
తిరుమల ఘాట్ రోడ్ లోకి భారీగా ఏనుగుల గుంపు వచ్చింది. మొదటి ఘాట్ రోడ్ లో ఏనుగులు గుంపు రావడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద భారీగా ఏనుగుల గుంపు కనిపించడంతో భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏడో మైలు రాయి దగ్గర సంచరిస్తున్న ఏనుగుల గుంపును అధికారులు అటవీ ప్రాంతంలోకి మళ్లించారు.
ఏడో మైలురాయి వద్ద...
తిరుమలకి వెళ్లి శ్రీవారి దర్శనం తరువాత తిరిగి వచ్చే సమయంలో ఏనుగులు రోడ్డు పైకి రావడంతో భక్తుల వాహనాలు నిలిపేశారు. తిరుమల నుంచి తిరుపతి కి వెళ్లడానికి తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఏనుగులకు దూరంగా చీకట్లో వాహనాలు ఆపేసి అవి వెళ్లేంత వరకూ వేచిఉన్నారు. టీటీడీ ఫారెస్ట్ అధికారులు సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చివరకు ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి పంపించడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story