Mon Dec 23 2024 07:48:45 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఏలూరులో వైసీపీకి మరో షాక్
ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ తో పాటు పెదబాబు 30 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని వీడే నేతలు ఎక్కువయ్యారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్ కూడా వైసీపీ చేజారి పోతుంది.
మేయర్ తో పాటు...
ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ తో పాటు ఆమె భర్త పెదబాబు టీడీపీలో చేరనున్నారు. రేపు ఉండవల్లిలో నారా లోకేష్ సమక్షంలో వారు చేరనున్నారు. ఎమ్మెల్యే బడేటి చంటితో జరిపిన చర్చలు సఫలం కావడంతో వారు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారితో పాటు వైసీపీకి చెందిన ముప్పయి మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఏలూరు కార్పొరేషన్ టీడీపీ పరం కానుంది.
Next Story