Sat Dec 21 2024 14:24:10 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఏలూరులో వైసీపీని వీడిన మరో నేత
ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్తప్రసాదరావు కూడా వైసీపీకి రాజీనామా చేశారు
ఏలూరు జిల్లాలో వైసీపీని నేతలు వదలి వెళ్లిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని రాజీనామాతో మొదలయిన వలసల పర్వం ఆగడం లేదు. ఆళ్ల నాని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఏలూరు మేయర్ దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తాజాగా ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు కూడా పార్టీకి రాజీనామా చేశారు.
జనసేనలోకి వెళుతున్నామని...
తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత జగన్ కు పంపారు. వారిద్దరూ జనసేనలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏలూరు జిల్లాలో వైసీపీికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్లయింది. మిగిలిన పార్టీ నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలిసింది. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడంతో పార్టీలు మారడంలో ఏలూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పాలి.
Next Story