Mon Dec 23 2024 17:13:45 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యమం విరమణ తాత్కాలికమే
తాము తమ డిమాండ్లను సాధించేంతవరకూ ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
తాము తమ డిమాండ్లను సాధించేంతవరకూ ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆందోళనను తాత్కాలికంగా విరమించినట్లు ఆయన చెప్పారు. పీఆర్సీపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని వారు ఆశాభావవం వ్యక్తం చేశారు. పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు. మిగిలిన 70 డిమాండ్లపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం వెల్లడించాల్సిందేనని బొప్పరాజు తెలిపారు.
లిఖితపూర్వకంగా...
కాగా తాము సమ్మెను విరమించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. తమ డిమాండ్లను అమలు చేస్తామని చీఫ్ సెక్రటరీ తమకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని అందుకోసమే తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి తమ కార్యాచరణ ఉంటుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story