Mon Dec 23 2024 11:33:56 GMT+0000 (Coordinated Universal Time)
పక్కా స్కెచ్ తో భారీగా ఉద్యోగులు... చేతులెత్తేసిన పోలీసులు
ప్రభుత్వ ఆంక్షల మధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చాయి.
విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు కదం తొక్కారు. చలో విజయవాడ కార్యక్రమం కోసం రెండు రోజుల ముందే వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకున్నారు. ప్రభుత్వ ఆంక్షల మధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చాయి. చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 3న నిర్వహిస్తామని ముందే ప్రకటించారు.
అనుమతించిన పోలీసులు.....
అయితే ప్రభుత్వం పీఆర్సీ ఉత్తర్వులను ఉపసంహరించుకోక పోవడం తో చలో విజయవాడను ఉద్యోగ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్టీఎస్ రోడ్డులోకి ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదని పోలీసులు ముందుగా ప్రకటించినా వేల సంఖ్యలో ఉద్యోగులు చేరుకోవడంతో పోలీసులు చేతులెత్తేశారు. దీంతో బీఆర్టీఎస్ రోడ్డులోకి ఉద్యోగులను అనుమతించారు. పీఆర్సీ సాధన సమితి ఇంటలిజెన్స్ కు కూడా అందకుండా పక్కా ప్లాన్ చేయడంతోనే చలో విజయవాడ కార్యక్రమానికి వేలాది మంది ఉద్యోగులు చేరుకున్నారు. ఎన్జీవో భవన్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
Next Story