Mon Dec 23 2024 23:06:13 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఉద్యమ కార్యాచరణ.. సమ్మె ఎప్పడంటే?
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు కార్యాచరణను ప్రకటించనున్నాయి
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు కార్యాచరణను ప్రకటించనున్నాయి. ఈరోజు సచివాలయంలో అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీకి ఎప్పుడు నోటీసు ఇవ్వాలి? ఎప్పుడు సమ్మె చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
చీఫ్ సెక్రటరీకి....
ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, సచివాలయం ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన పీీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై వెనక్కు తగ్గకపోవడంతో సమ్మెకు దిగేందుకు సిద్దమయ్యాయి. ఈరోజు ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగే అవకాశాలున్నాయి. ఈరోజు, రేపు చీఫ్ సెక్రటరీకి ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇవ్వనున్నాయి.
Next Story