Fri Dec 20 2024 08:04:32 GMT+0000 (Coordinated Universal Time)
విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు .. విచారణకు రావాలంటూ?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు నోటీసులు జారీ చేశారు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాకినాడ సీ పోర్టును, సెజ్ ను బలవంతంగా లాక్కున్నారన్న కేసులో విజయసాయిరెడ్డి ఈడీ నోటీసులు జారీ చేసింది. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ప్రాధమిక విచారణ జరిపిన ఈడీ భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు భావించి విచారించేందుకు నోటీసులు జారీ చేసింది.
మనీలాండరింగ్ చట్టం కింద...
మనీ లాండ్ నిరోధక చట్టం కింద ఈ కేసులో నిందితులైన వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున తాను విచారణకు హాజరు కాలేనని విజయసాయిరెడ్డి ఈడీ అధికారులకు తెలిపారు. ఆరోగ్యం కారణాలతో తాను హాజరు కాలేనని విక్రాంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారుల నుంచిమరోసారి విచారణకుహాజరు కావాలని నోటీసులు వచ్చాయి.
Next Story