Mon Dec 23 2024 05:34:26 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ ఛార్జిషీట్
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. బీఎస్ 4 వాహనాల మనీ లాండరింగ్ స్కామ్ కేసులో ఈడీ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. బీఎస్ 4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను దేశంలో విక్రయించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని తెలిపింది.
అయినా వాటిని కొనుగోలు...
అయినప్పటికీ, జేపీ ప్రభాకర్ రెడ్డి, సి. గోపాల్ రెడ్డితో పాటు పలువురు వ్యక్తులు అశోక్ లీలాండ్ లిమిటెడ్ నుండి బీఎస్-3 వాహనాలను జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. నకిలీ పత్రాల ఆధారంగా బీఎస్-4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఈసీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ భాగం నాగాలాండ్‌లో జరుగగా, కొన్ని కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగాయని తెలిపింది. జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ వాహనాలను సొంతం చేసుకోవడం, నడపడం, విక్రయించడం ద్వారా 38 కోట్ల రూపాయలు సంపాదించారని ఈడీ తెలిపింది.
Next Story