Mon Dec 23 2024 18:20:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వేగం పెంచారు. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. ఇప్పటికే ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో మరింత స్పీడ్‌ను ఈడీ పెంచిందనే చెప్పాలి.
కస్టడీ పొడిగింపు...
ఇదే కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవ జైలులో ఉన్నారు. ఈరోజు అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ కోర్టులో హాజరుపర్చింది. మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. విచారణ పూర్తి కాలేదని, మరికొన్ని రోజులు విచారించాల్సి అవసరం ఉందని పేర్కొంది. అయితే న్యాయస్థానం మాత్రం అరుణ్ రామచంద్ర పిళ్లైని మూడు రోజుల పాటు మాత్రమే స్పెషల్ కోర్టు అనుమతించింది.
Next Story