Mon Dec 23 2024 14:05:24 GMT+0000 (Coordinated Universal Time)
మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. వైసీపీ ఎంపీ మాగుంటకు గతంలోనే ఈడీ నోటీసులు జారీ చేసింది.
రేపు హాజరవుతారా?
ఈ నెల 18వ తేదీన మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరు కావాల్సి ఉండగా తన సోదరుడి కుమారుడి ఆరోగ్యం బాగా లేదని రాలేకపోతున్నట్లు తెలిపారు. దీంతో ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మాగుంట రేపు విచారణకు రావాలని కోరారు. మరి మాగుంట హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story