Mon Dec 23 2024 08:49:20 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ వ్యాపారికి చెందిన వంద కోట్ల ఆస్తుల జప్తు
న్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యాపారికి సంబంధించి వంద కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యాపారికి సంబంధించి వంద కోట్ల ఆస్తులను జప్తు చేసింది. రుణాల పేరుతో బ్యాంకును మోసం చేసిన కేసులో విశాఖకు చెందిన రెబ్బా సత్యనారాయణకు చెందిన వంద కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. చేపల చెరువల కోసం సత్యనారాయణ ఐడీబీఐ నుంచి 112 కోట్ల రూపాయల ఐడీబీఐ బ్యాంకు నుంచి రుణాలను తీసుకున్నారు.
బినామీల పేరిట....
అయితే ఈ రుణాలను 143 మంది బినామీల పేరిట రుణాలను పొందిన సత్యనారాయణ బ్యాంకులను మోసం చేసేందుకు యత్నించారు. దీంతో దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. సత్యనారాయణ 24లక్షల డాలర్ల విలువైన చేపలను, రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేశారని తెలిపింది.
Next Story