Mon Dec 23 2024 02:34:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
వైసీపీ విశాఖ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది.
వైసీపీ విశాఖ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. ఆయన తెలుగు సినీ నిర్మాత కూడా. ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఆడిటర్ వెంకటేశ్వరరావు, గద్దె బ్నహ్మాజీ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలను నిర్వహిస్తుంది. మొత్తం ఐదు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖ పట్నం పరిధిలో నమోదు చేసిన కేసులు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై మోసం, కుట్ర, ఫోర్జరీ వంటి ఆరోపణలతో కేసు నమోదయింది. దీనిపై ఆయన హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
ఐదు చోట్ల దాడులు...
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్ కూడా. ఆయన తన సంతకాలను ఫోర్జరీ చేసి విక్రయ పత్రాలను కూడా తయారు చేశారని ఆరోపణలున్నాయి. హయగ్రీవ కనస్ట్రక్షన్స్ విశాఖ పరిధిలో వృద్ధాశ్రమం, అనాధాశ్రమాన్ని నిర్మించడానికి 2008లో ప్రభుత్వం నుంచి 12.51 ఎకరాలను అప్పట్లో మార్కెట్ రేటుకు కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత 2010లో మధురవాడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అయితే ఆడిటర్ వెంకటేశ్వరరావు, ఎంవీవీ సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీలు కలసి ఈ స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. బలవంతంగా తమపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. 2019లో విశాఖ ఎంపీగా గెలిచిన ఎంవీవీ సత్యనారాయణ 2024 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Next Story