Fri Dec 20 2024 07:41:12 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏపీలో మరో ఈడీ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ చలాన్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు
ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ చలాన్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయడానికి ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు.
36 కోట్లు...
ట్రాఫిక్ చలాన్ల కేసులో 36 కోట్ల రూపాయలు దారిమళ్లాయని ఏపీ పోలీసులు కూడా ఆరోపించారు. అవినాష్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. అవినాష్ మాజీ డీజీపీ కి దగ్గర బంధువుగా తేలింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేయడం విశేషం.
Next Story