Fri Dec 27 2024 00:17:55 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు అందుకే చేశాం : ఈడీ
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో దాడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ప్రకటన చేశారు
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో దాడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ప్రకటన చేశారు. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీన తాము విశాఖలోని ఐదు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంది.
మనీలాండరింగ్...
రెండు వందల కోట్ల రూపాయల విలువైన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదులపై ఈ సోదాలు నిర్వహించామని ఈడీ అధికారులు తెలిపారు. వృద్ధులు, అనాధల కోసం గృహాలను నిర్మించాల్సిన ప్రాంతంలో భూమిని సొంతం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రయత్నించారని ఈడీ అధికారులు తెలిపారు. అరిలోవ పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసు ఆధారంగానే సోదాలు చేసినట్లు ఈడీ ఒక ప్రకటన వెల్లడించింది.
Next Story