Sun Dec 22 2024 21:21:41 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Prdesh : ఈ ప్రశ్నలకు అవునన్నారా? ఇక రేషన్ కార్డు కట్... ప్రశ్నలివే
ఆంధ్రప్రదేశలో రేషన్ కార్డుల పరిశీలన మొదలయింది. నేడు కూడా పరిశీలన జరుగుతుంది.
ఆంధ్రప్రదేశలో రేషన్ కార్డుల పరిశీలన మొదలయింది. నేడు కూడా పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలనలో మొత్తం పదమూడు ప్రశ్నలున్నాయి. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు అవునని లబ్దిదారుడు సమాధానమిచ్చినా రేషన్ కార్డు రద్దవుతుంది. సామాజిక పింఛన్ల తనిఖీల్లో భాగంగా సచివాలయ సిబ్బంది పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామంలో నలభై ఇళ్లలో పరిశీలన చేస్తున్నారు. నిన్న, ఈరోజు ఈ పరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి నిజమైన అర్హుడే ఫించన్ పొందెందుకే ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ప్రతి జిల్లాకు ఒక సచివాలయం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్లు తీసుకునే లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రెండురోజల పాటు...
ఈ నెల 9, 10 తేదీల్లో తనిఖీలు చేపడుతోంది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టులో వచ్చే సమాచారారన్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో త్వరలో ఇదే విధమైన తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. భోగస్, అనర్హుల పింఛన్ల విషయంపై వికలాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు పింఛన్ పొందుతున్నట్లు ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులు అందాయి. దాదాపు యాభై ఆరు లక్షల మంది అనర్హులుగా ఉన్నారని ఫిర్యాదులందడంతో ఈ తనిఖీలను చేపట్టింది. తొలివిడత చేపట్టనున్న పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని ఈ నెల 9న ఒక్కరోజే పూర్తి చేసి, 10న సాయంత్రం 5 గంటలకల్లా ప్రభుత్వానికి అధికారులు, సచివాలయ ఉద్యోగులు నివేదిక ఇవ్వాలి. తనిఖీల్లో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించింది. ఒక్కో సర్వే బృందం 40 మంది పింఛనుదారులను ప్రత్యక్షంగా కలిసి యాప్‌లో వివరాలు సేకరించనుంది.
పదమూడు ప్రశ్నిలివే...
01. పింఛనుదారుని స్టేటస్‌ను యాప్‌లో నివాసం ఉంటున్నారా? మరణించారా? అందుబాటులో లేరు అనే కాలమ్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
03. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.12 వేలు ఆపైన ఉందా?
04. కుటుంబానికి మూడెకరాలు కంటే ఎక్కువ మాగాణి, పదెకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండూ కలిపి పదెకరాల కంటే ఎక్కువ భూమి ఉందా?
05. కుటుంబంలో ఎవరైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా? (ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటో మినహాయింపు)
06. అవును, లేదు అనే కాలమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
07. అదే విధంగా కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్ ఎవరైనా ఉన్నారా?
08. కుటుంబ సరాసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందా?
09. మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగులు కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా?
10. కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా?
11. కుటుంబంలో ఎవరైనా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారా?
12. పింఛన్‌దారు వికలాంగత్వం కలిగి ఉన్నారా?
13. పింఛన్‌దారుని రీ అసెస్మెంట్కు (వైద్య పరీక్షలకు) సిఫార్సు చేస్తున్నారా?
పై ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసిన అనంతరం పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదా అనే వివరాలు తనిఖీ చేసే ఉద్యోగి యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పింఛన్‌దారుని ఫొటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది
Next Story