Mon Mar 31 2025 15:44:08 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : సమీక్షలు.. సమావేశాలంటే బోర్ ఫీలవుతున్నారా? పవన్ గైర్హాజరుకు కారణమదేనా?
పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి నాళ్లలో ఉన్న ఉత్సాహం తర్వాత కనిపించడం లేదు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి నాళ్లలో ఉన్న ఉత్సాహం తర్వాత కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొనకపోవడంపై కూడా హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ ఆరోగ్యం బాగా లేక సమావేశానికి హాజరు కాలేదని తొలి రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే నిన్న ఆయన పిఠాపురం నియోజకవర్గం విషయంలో రివ్యూ వ్యవహరించడం చూస్తుంటే కావాలని హాజరు కాలేదా? లేక నిజంగానే ఆరోగ్యం బాగాలేక హాజరు కాలేదా? అన్న చర్చ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత మూడో సారి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం రెండు రోజుల పాటు జరుగుతుంది. ఇక మంత్రి వర్గ సమావేశాలు నెలకు రెండు రోజుల పాటు జరుగుతాయి. పవన్ కల్యాణ్ నిత్యం సమీక్షలతో అధికారులతో సమావేశాలు నిర్వహించడం కంటే క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపైన, పాలనపైనా పవన్ దృష్టిపెట్టాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మంత్రి వర్గ సమావేశానికి కూడా ఆయన ఆరోగ్యం పేరు చెప్పి హాజరు కాలేదు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్న వార్తలు వచ్చాయి.
తమిళనాడులో మూడు రోజులు...
కానీ ఆ తర్వాత వెంటనే తమిళనాడులో మూడు రోజుల పాటు దేవాలయాలను దర్శించడం కూడా పవన్ కల్యాణ్ మైండ్ లో ఏదో తిరుగుతుందన్నది ఆయనకు కావాల్సిన వాళ్లు చెబుతున్నారు. కానీ ఆయన ఎక్కడా బయటపడటం లేదు. తామంతా కలిసే ఉన్నామని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదిహేనేళ్ల పాటు కొనసాగాలని కూడా కోరుకున్నారు. కానీ సమీక్షలు, మంత్రివర్గ సమావేశాలు, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లకు ఎందుకు హాజరు కావడం లేదంటే సమయం వృధా అని పవన్ కల్యాణ్ భావిస్తున్నారా? లేక నిజంగానే చంద్రబాబు వరస సమీక్షలు నిర్వహిస్తుండటం, మంత్రివర్గ సమావేశాలు కూడా వరసగా పెడుతుండటం, గంటల తరబడి మంత్రులను కూర్చోబెట్టడం నచ్చక అనారోగ్యం పేరు చెప్పి తప్పుకుంటున్నారా? అన్నది తెలియకుండా ఉందని అంటున్నారు.
సమావేశాలు ముగిసన తర్వాత...
కానీ పవన్ కల్యాణ్ గైర్హాజరయిన సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన హడావిడిగా పర్యటిస్తుండటంతో అనారోగ్యం కాదని అందరికీ అర్థమవుతుంది. జనసైనికులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. తరచూ అనారోగ్యం అని చెప్పినా ఎవరూ నమ్మరని, ఏదో బలమైన కారణంతోనే పవన్ కల్యాణ్ కొన్ని ముఖ్యమైన మావేశాలకు దూరంగా ఉంటున్నారనే వారు కూడా లేకపోలేదు. అదే సమయంలో పవన్ కల్యాణ్ హీరోగా రాజకీయాల్లోకి వచ్చారు. జనంలోకి వెళ్లమంటే వెళతారు. అంతే తప్ప అధికారులను గంటల తరబడి కట్టిపడేసి కూర్చుండ బెట్టి క్లాసులు పీకినంత మాత్రాన ప్రయోజనం ఉండదని తన మనసులో మాటను బయటకు చెప్పలేక ఇలా వ్యవహరిస్తున్నారా? అన్న సందేహం కూడా తలెత్తుంది.
Next Story