Wed Apr 02 2025 10:43:37 GMT+0000 (Coordinated Universal Time)
Schools Holidays : నేడు పాఠశాలలకు సెలవులున్న జిల్లాలివే
భారీ వర్షాలు తగ్గినా ఇంకా దాని ప్రభావం ఉండటంతో ఆ:ధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

భారీ వర్షాలు తగ్గినా ఇంకా దాని ప్రభావం ఉండటంతో ఆ:ధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
వర్ష ప్రభావం...
ఇంకా వర్షం కురిసిన ప్రభావం ఉండంటంతో పాటు పలు ప్రాంతాల్లో వరద నీరు కాలనీల నుంచి వెళ్లకపోవడంతో ఈ ఉత్తర్వులు కలెక్టర్లు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లగా, ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, గుంటూరు పట్టణాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దీంతో ఈరోజు కూడా పాఠశాలలకు ఆ యా జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.
Next Story