Thu Apr 10 2025 01:35:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చంద్రబాబు సమీక్ష
నేడు కూడా చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నారు.

నేడు కూడా చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నారు. పీలేరులో నియోజకవర్గాల నేతలతో ఆయన స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. దీంతోపాటు కొందరు నేతలు యాక్టివ్ గా లేకపోవడం, పార్టీ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి వాటిపై నేతలతో నేరుగా చర్చించనున్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
నేతలకు అభినందనలు
నిన్న మదనపల్లెలో మినీ మహానాడుకు భారీ జనసమీకరణ జరిగింది. దీనిపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నేతలను అభినందించారు. రేపు నగరి, జీడీ నెల్లూరు లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా నేతలు చేస్తున్నారు.
Next Story