Thu Dec 19 2024 23:02:54 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు.. సింగిల్ గానే పోటీ చేసినా?
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ 160 సీట్లను గెలుస్తుందన్నారు
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ 160 సీట్లను గెలుస్తుందని చెప్పారు. చిలకలూరిపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. సింగిల్ గా పోట ీ చేసే సత్తా టీడీపీకి ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రత్తిపాటి చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవ్వాలని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
అసమర్థ పాలనతో..
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసమర్థ పాలనపై ప్రత్తిపాటి పుల్లారావు మండి పడ్డారు. ప్రజలంతా జగన్ పాలనలో రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. విధ్వంసాలు, అరాచకాలు, కూల్చివేతలతోనే వైసీపీ ప్రభుత్వ పాలన సమయం ముగిసిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. విషంతో కూడిన మద్యాన్ని బ్రాందీ షాపుల్లో విక్రయిస్తున్నారని ప్రత్తిపాటి ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో ఇళ్ల స్థలాల పేరుతో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.
Next Story