Mon Dec 23 2024 07:22:29 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు మద్దతుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ
టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేశారని కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు చింతామోహన్ వ్యాఖ్యానించారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేశారని కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు చింతామోహన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్న ఆయన న్యాయస్థానాల్లోనూ రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తుందని అభిస్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబును తక్షణం జైలు నుంచి విడుదల చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.
ఆరోపణలు మాత్రమే...
చంద్రబాబుపై ఉన్నది కేవలం ఆరోపణలు మాత్రమేనని, రాహుల్ గాంధీ లాగే చంద్రబాబును కూడా ఇబ్బంది పెట్టాలన్న యోచనలో ఈ ప్రభుత్వాలున్నాయని అన్న ఆయన 37 రోజులుగా జైలులో పెట్టడం తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. వాజపేయి, పీవీ నరసింహారావు కుట్రల ఫలితంగానే అప్పట్లో అద్వానీపై కేసులు పెట్టారని, వాటి ఫలితంగా ఆయన ఇప్పటికీ ప్రధాని కాలేకపోయారని చింతా మోహన్ అన్నారు.
Next Story