Mon Dec 23 2024 16:23:02 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలప్రియకు కాల్... వెనువెంటనే ఉండవల్లి చంద్రబాబు నివాసానికి
మాజీ మంత్రి అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆమె హుటాహుటిన బయలుదేరి వెళ్లారు
మాజీ మంత్రి అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆమె హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు నియోజవకర్గాల అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ఖరారు చేసే పనిలో ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన అదే పనిలో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే జనసేన, బీజేపీ పొత్తు ఉండటంతో ఆమె కు సీటు ఇస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
సీటు కన్ఫర్మ్ చేయడానికేనా?
భూమా అఖిలప్రియకు సీటు కన్ఫర్మ్ చేయడానికి, ఏవీ సుబ్బారెడ్డి, ఫరూక్ కుటుంబంతో సఖ్యతగా మెలగాలని చెప్పడానికి చంద్రబాబు పిలిపించారా? లేదా జనసేనకు పొత్తులో భాగంగా సీటు కేటాయిస్తామని చెప్పడానికి కాల్ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద అఖిలప్రియ హుటాహుటిన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడంతో ఆమెను ఎందుకు చంద్రబాబు పిలిపించారన్న దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. నంద్యాల సీటు భూమా కుటుంబానికి కూడా ఎన్ఎండీ ఫరూక్ కుటుంబానికి కేటాయించడంతో ఆళ్లగడ్డ టిక్కెట్ పైనా సందేహాలు నెలకొన్నాయి.
Next Story