Mon Dec 23 2024 06:12:45 GMT+0000 (Coordinated Universal Time)
Ambati : పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబే
పోలవరం పనుల ఆలస్యానికి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటమే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాాబు అన్నారు
పోలవరం పనుల ఆలస్యానికి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటమే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాాబు అన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది చంద్రబాబు హయాంలోనే జరిగిందని అంబటి రాంబాబు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన 2018 నాటికే పోలవరాన్ని పూర్తి చేస్తామని అప్పట్లో చంద్రబాబు చెప్పారని మాజీ మంత్రి గుర్తు చేశారు.
కమీషన్ల కోసం...
పోలవరం ప్రాజెక్టులో కమీషన్లు దండుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. అంతేకాదు ప్రోటో కాల్ లేకుండా పోలవరం పనులు చేపట్టారని, ఈ విషయాన్ని అంతర్జాతీయ సభ్యుల కమిటీ చెప్పిందని రాంబాబు గుర్తుచేశారు. తాము అధికారంలో ఉండగా పోలవరం పనులు వేగంగా జరిగాయని చెప్పారు. ప్రస్తుతం పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Next Story