Tue Jan 07 2025 22:36:27 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : వాళ్లిద్దరికీ చెరో రెండు కోట్లు ఇవ్వండి.. పవన్ కు అంబటి సూటి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అంబటి రాంబాబు ప్రశ్నలు వేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అంబటి రాంబాబు ప్రశ్నలు వేశారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మరణించిన కుటుంబాల వారికి చెరో రెండు కోట్ల రూపాయలపరిహారాన్నిప్రకటించాలని అంబటి రాంబాబు కోరారు. పుష్ప సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన వెంటనే అల్లు అర్జున్, ఆ సినిమాదర్శకులు, ప్రభుత్వం ఆ కుటుంబానికి రెండు కోట్ల రూపాయల సాయం ప్రకటించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. పుష్ప సినిమా వద్ద జరిగిన ఘటనలో కూడా అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా ఆయనను ఇరికించారన్నారు.
వీరి ప్రమేయం లేకున్నా...
ఇప్పుడు కూడా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లకు ఆ ఇద్దరి మృతితో సంబంధం లేకపోయినా అందరూ కలసి మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు చెరో రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఏడీబీ రోడ్డు బాగా లేనందునే ప్రమాదం జరిగిందని, వైసీపీ ప్రభుత్వమే ఈ ప్రమాదానికి కారణమని పవన్ అంటున్నారని, ఆ రోడ్డు బాగానే ఉందని, ఎన్నాళ్లు అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా ఇంకా వైసీపీ ప్రభుత్వంపై నెపం నెడుతూ పబ్బం గడుపుకుంటారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story