Mon Dec 15 2025 02:07:45 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : వైసీపీ వారినే టార్గెట్ చేస్తున్నారెందుకు?
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వైసీపీ కార్యకర్తలను వందలాది మందిని అరెస్ట్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వైసీపీ కార్యకర్తలను వందలాది మందిని అరెస్ట్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మరి వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు అంబటి రాంబాబు గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లోకేష్ పై చర్యలేవీ?
వైసీపీ అధినేత జగన్ కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులను పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై లోకేష్ చేసిన అసభ్యకరమైన కామెంట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ పై లోకేష్ చేసిన ట్వీట్ల విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. హోంమంత్రిని అసభ్య పదజాలంతో దూషించారంటూ వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, ఇది అభ్యంతరకరమని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
Next Story

