Thu Dec 19 2024 03:44:56 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి కటౌట్ కు పోలీసుల పహారా
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 15 మంది పోలీసులు కాపాల కాయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 15 మంది పోలీసులు కాపాల కాయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక సీఐతో పాటు పదిహేను మంది పోలీసులు ఆయన కటౌట్ కు కపలా కాశారు. ఇది నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అనిల్ కుమార్ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని నర్తకి సెంటరులో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.
పుట్టిన రోజుకు...
కానీ ఇక్కడ కటౌట్ ఏర్పాటు చేయడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. ఎన్టీఆర్ విగ్రహానికి అనిల్ కటౌట్ అడ్డుగా ఉందని, దాన్ని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను టీడీపీ నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోరారు. ఇదిలా ఉంటే.. టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఎవరైనా ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగిస్తారనే అనుమానంతో పోలీసులు పహారా కాశారు. ఈ సమయంలో అనిల్ కటౌట్ కు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story