Sun Dec 22 2024 15:38:57 GMT+0000 (Coordinated Universal Time)
నేనే హోం మంత్రి... అప్పుడు చూపిస్తా
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తానే హోంమంత్రినని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తానే హోంమంత్రినని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. తొమ్మిది నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన చెప్పారు. పార్టీ అధికారంలోకి రావడం ఎంతో దూరం లేదన్నారు. అయితే తాను ఈసారి హోంమంత్రిని అవుతానని అయ్యన్న పాత్రుడు చెప్పారు.
లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో.....
అప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తాను చూపిస్తానని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అన్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం చెప్పిన మాటకల్లా తల ఊపుతూ తప్పుడు కేసులు పెడుతున్నారని అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. తొమ్మిది నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని అయ్యన్న పాత్రుడు జోస్యం చెప్పారు.
Next Story