Tue Dec 24 2024 17:55:07 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ మంత్రికి హైకోర్టులో చుక్కెదురు
మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దాడిశెట్టి రాజా బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తునిలో జరిగిన ఒక హత్య కేసులో దాడిశెట్టి రాజా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ దాడిశెట్టి రాజా హైకోర్టులో కొద్ది రోజుల క్రితం పిటీషన్ వేశారు.
బెయిల్ పిటీషన్ ను...
ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు చెప్పింది. దాడిశెట్టి రాజా బెయిల్ పిటీషన్ ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో త్వరలో దాడిశెట్టి రాజాను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముంది. అయితే రాజా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని ఆయన తరుపున న్యాయవాదులు తెలిపారు.
Next Story