Sun Dec 22 2024 19:07:44 GMT+0000 (Coordinated Universal Time)
కమ్మోళ్లు ఇప్పుడు గుర్తుకొచ్చారా?
పరిపాలన చేతకాని వారే కులం మాట ఎత్తుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు
కమ్మ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. పరిపాలన చేతకాని వారే కులం మాట ఎత్తుతారని ఉమ అన్నారు. అయ్యా కొడుకులు డ్రామాలు ఆడాతున్నారన్నారు. అవసరమైన సమయంలో మాత్రం వారికి కులం కనిపించిందని అన్నారు. మైలవరంలో వైఫల్యం చెందండంతోనే వసంత కుటుంబానికి ఇప్పుడు కులం గుర్తుకు వచ్చిందని ఆయన అన్నారు.
అధికారంలోకి రాగానే...
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుగా మారుస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే తొలుత చేసే పని అదేనని ఆయన అన్నారు. మైలవరంలో తరిమి కొడతారని భావించిన వారికి ఇప్పడు కులం గుర్తుకు వచ్చిందని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.
Next Story