Fri Dec 20 2024 06:55:27 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ ను షా అందుకే కలిశారు
జూనియర్ ఎన్టీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
జూనియర్ ఎన్టీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షాలు ఉపయోగం లేకుండా ఎవరితోనూ నిమిషమైనా మాట్లాడరని ఆయన అన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయి ఉండవచ్చని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయొచ్చని ఆయన అన్నారు.
చంద్రబాబు వల్ల...
బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటి అయ్యారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయనతో బీజేపీకి అనుకూలంగా దేశంలో ప్రచారం చేయించుకోవచ్చని ఆశపడి జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారన్నారు. చంద్రబాబుతో ఉపయోగం లేదు కాబట్టి మోదీ, అమిత్ షాలు ఆయనకి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
Next Story