Fri Dec 20 2024 01:36:54 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేస్తున్నారు
మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పూర్తిగా పతనమయిందని నాని అన్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పూర్తిగా పతనమయిందని నాని అన్నారు. ఎన్టీఆర్ డీఎన్ఐను పూర్తిగా లేకుండా చేయడానికి టీడీపీ నాయకత్వం పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. లోకేష్ కు నాయకత్వాన్ని అప్పగించడం కోసం జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారని, పార్టీకి దూరం చేశారని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు.
గుడివాడలో ఎవరిమీదనైనా....
లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆక్రమించాలని ఒక సామాజికవర్గం ప్రయత్నిస్తుందని, పన్నాగం పన్నుతుందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదని కొడాలి నాని జోస్యం చెప్పారు. గుడివాడలో తనపై ఎవరినైనా పోటీకి దింపవచ్చని, దమ్ముంటే చంద్రబాబు లేదా లోకేష్ పోటీ చేయాలని ఆయన మరోసారి సవాల్ విసిరారు.
Next Story