Fri Dec 20 2024 12:12:52 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ జూమ్ మీటింగ్ లోకి కొడాలి నాని
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ లోకి మాజీ మంత్రి కొడాలి నాని రావడం సంచలనంగా మారింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ లోకి మాజీ మంత్రి కొడాలి నాని రావడం సంచలనంగా మారింది. లోకేష్ ఈరోజు టెన్త్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులతో నారా లోకేష్ నిర్వహించారు. ఇంతలో మధ్యలో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వచ్చి జాయిన్ అయ్యారు. వీరిద్దరూ జాయిన్ అవ్వడంతో లోకేష్ ఒకింత అవాక్కయ్యారు. అయితే వీరిని చూసి వెంటనే నారా లోకేష్ ఒకింత అవాక్కయ్యారు.
పదో తరగతి...
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలపై టీడీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రిజల్ట్ తగ్గడానికి దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ ఆరోపిస్తుంది. మ్మఒడిని కట్ చేయడానికే ఫలితాలను తగ్గించారన్న విమర్శలు కూడా టీడీపీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు నారా లోకేష్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ లోకి వైసీపీ యాక్టివిస్ట్ ఒకరు చొరబడ్డారు. విద్యార్థులలో విషం నింపవద్దని లోకేష్ ను కోరారు. బాగా చదివి పరీక్ష రాస్తే పాస్ అవుతారని, ప్రభుత్వం కావాలని ఎందుకు చేస్తుందని వైసీపీ యాక్టివిస్ట్ లోకేష్ ను ప్రశ్నించారు. ఈలోగా జూమ్ మీటింగ్ లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ రావడంతో నిర్వాహకులు కాల్ కట్ చేశారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం విచారణ ప్రారంభించింది. విద్యార్థుల ఐడీలతో వారు లాగిన్ అయినట్లు అనుమానిస్తుంది.
Next Story