Wed Apr 09 2025 21:39:59 GMT+0000 (Coordinated Universal Time)
పరిటాల సునీత పాదయాత్ర
మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర చేస్తున్నారు. రైతు కోసం తెలుగుదేశం పేరిట ఈ పాదయాత్రకు ఆమె శ్రీకారం చుట్టారు.

మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర చేస్తున్నారు. రైతు కోసం తెలుగుదేశం పేరిట ఈ పాదయాత్రకు ఆమె శ్రీకారం చుట్టారు. సునీత పాదయాత్ర చేస్తుందని తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో ఆమెకు మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చారు. అయితే పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు.
పోలీసుల ఆంక్షలు...
జి కొత్తపల్లి నుంచి రాప్తాడు వరకూ ఆమె పాదయాత్ర చేయనున్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం సునీత ఈ పాదయాత్ర చేస్తున్నారు. అయితే పాదయాత్రకు సునీతకు మాత్రమే అనుమతి ఉందని, యాత్రలో పరిసర గ్రామల ప్రజలు ఎవరూ పాల్గొన కూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. మొత్తం పదిహేను కిలోమీటర్ల మేరకు సునీత పాదయాత్ర చేయనున్నారు.
Next Story