ఆ స్థానాల్లో జనసేన అభ్యర్ధులు బరిలో ఉండరా..? : పేర్ని నాని
పవన్ కళ్యాణ్‌కు ఏదో ఒకటి మాట్లాడటం అలవాటు.. జనం నవ్వుకుంటారు అని లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు
పవన్ కళ్యాణ్‌కు ఏదో ఒకటి మాట్లాడటం అలవాటు.. జనం నవ్వుకుంటారు అని లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ జగన్‌పై బురద చల్లడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా ఆస్తులు కొనుక్కుంటున్నాడు.. ఫోటో లు దిగి పెడుతుంటాడు కదా.. ఉద్దేశపూర్వకంగా బురద చల్లడం తప్పితే ఏమి లేదని.. ఏదో కిరాయి తీసుకున్నాడు కదా మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు. జగన్‌పై విపరీతమైన ద్వేషంతో ఏదో ఒకటి మాట్లాడటం.. ఇదంతా ఎందుకు.. శంశేర్ గా చెప్పు.. నేను చంద్రబాబు కోసం పనిచేస్తున్నాను అని, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తామని చెప్పండని సవాల్ విసిరారు.
టీడీపీ ఇంఛార్జ్ పెట్టిన చోట జనసేన ఇంఛార్జ్ లను పెట్టదన్నారు. నువ్వు నిజాయితీ గలవాడివి అయితే.. నేను, చంద్రబాబు గత 2014 నుండి 2019 వరకు చేసిన పరిపాలన కొనసాగిస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ నీ అటాడించే సత్తా వున్నోడివి.. స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడవు..? అంటే కేవలం జగన్‌ను ఆడిస్తానంటావు కానీ.. ప్రజల సమస్యల గురించి మాట్లాడవా అని ప్రశ్నించారు. గుంటూరులో ఏడు స్థానాలుంటే తెనాలి నుంచి మాత్రమే నాదెండ్ల మనోహర్‌ను బరిలో దింపుతానంటున్నావు. మిగతా స్థానాల్లో జనసేన అభ్యర్ధులు బరిలో ఉండరా అని ప్రశ్నించారు. తణుకులో రామచంద్రరావు అని చెప్తావ్.. పశ్చిమ గోదావరి జిల్లాలోని మిగతా స్థానాల్లో జనసేన అభ్యర్ధులు నిలబడరా అని అడిగారు. పార్లమెంట్‌కు ఒక సీటుకు పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావా అంటూ ఎద్దేవా చేశారు.
సినిమా గ్లామర్‌ను అడ్డం పెట్టుకుని ప్రజలను అమ్మేస్తున్నావని కామెంట్ చేశారు. వైసీపీ నుండి ఎవ్వరినీ పార్టీలోని రానివ్వను అని చెప్పి.. ఇప్పుడు బస్టాప్ వద్ద ఉండే టాటా మేజిక్ మాదిరిగా రండి రండి అని ఎదురుచూస్తున్నావంటూ ఎద్దవా చేశారు. నిలకడ లేని రాజకీయాలు కట్టిపెట్టాలని సూచించారు.