Wed Apr 02 2025 22:57:47 GMT+0000 (Coordinated Universal Time)
నడ్డాకు ఏపీపై అవగాహనలేదు
బీజేపీనేత నడ్డాపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గురించి నడ్డాకు మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గురించి నడ్డాకు మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా ఇక్కడకు వచ్చి తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమిచ్చారని మాట్లాడతారని నిలదీశారు. ప్రత్యేక హోదా గురించి అసలు పట్టించుకున్నారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. నడ్డాకు ఏపీలో జరుగుతున్న పథకాలపై అవగాహన లేదని, రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదివి వెళ్లి పోయారని ఆయన అన్నారు.
రాష్ట్ర పథకాలతో....
పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి నిధులు ఇస్తామని, 75 లక్షల మందికి పునరావసం కల్పిస్తామన్న హామీ ఏమయిందని నాని నిలదీశారు. ఆరోగ్యశ్రీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో చెప్పాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మేలు చేయకుండా ఇక్కడికి వచ్చి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో కేంద్ర ప్రభుత్వం పథకం నిధులున్నాయా? అని నాని ప్రశ్నించారు. గతంలో అంట కాగిన టీడీపీ, జనసేన, బీజేపీలు మరోసారి అదే ప్రయత్నంలో ఉన్నాయని పేర్ని నాని ఫైర్ అయ్యారు. తాము లెక్కకు మించి అప్పులు చేయడం లేదని, చేస్తుంటే కేంద్రం ఎందుకు ఊరుకుంటుందన్నారు.
Next Story