Mon Dec 23 2024 18:18:21 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : డ్రగ్స్ ర్యాకెట్ అంతా చంద్రబాబు బంధువులే
విశాఖ డ్రగ్స్ కేసు పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇందులో నిందితులు చంద్రబాబు బంధువులేనని ఆయన అన్నారు
విశాఖ డ్రగ్స్ కేసు పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులు చంద్రబాబుబాబు బంధువులేనని ఆయన అన్నారు. వారివి బీరకాయ పీచు బంధుత్వాలని పేర్ని నాని అన్నారు. తాము ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను వైఎస్సార్సీపీ నేతలు కలిసి వైజాగ్ డ్రగ్ రాకెట్లో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశామని తెలిపారు.
వదిన చుట్టాలేనంటూ...
చంద్రబాబు అవాస్తవాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్పైన చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఫిర్యాదు చేశామని చెప్పారు. లోతుగా విచారణ జరిపించాలని కోరా ఎన్నికల కమిషన్ కోరామన్నారు. చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారని, చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఓట్లు కొనుగోలు చేయం కోసం ఈ డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమోనని అనుమానం ఉందని పేర్ని నాని అన్నార.
Next Story