Fri Dec 27 2024 04:32:17 GMT+0000 (Coordinated Universal Time)
కోటి మంది క్యాడర్ ఎక్కడ? టీడీపీకి నాని ప్రశ్న
చంద్రబాబు అవినీతి కేసులో జైలుకెళ్లడం పట్ల టీడీపీ నేతలు ఎవరూ బాధపడటం లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
చంద్రబాబు అవినీతి కేసులో జైలుకెళ్లడం పట్ల టీడీపీ నేతలు ఎవరూ బాధపడటం లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిన్న ప్లేట్లు, గంటలు మోగించి సంతోషం వ్యక్తం చేశారా? అని నాని ప్రశ్నించారు. చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదన్న నాని నిన్న అంతా నవ్వుకుంటూ విజిల్స్ వేయడాన్ని చూసి జనానికి కూడా వీరి పోకడ అర్థం కాలేదన్నారు. లంచాలు తీసుకుని కంచాలు మోగించడమేంటని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జైలులో ఉన్నారన్న ఆవేదన వారిలో కించిత్ కూడా కన్పించలేదని అన్నారు.
కాపులకు రిజర్వేషన్లు...
కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని పేర్ని నాని అన్నారు. కోటి మంది సభ్యులున్నారని చెబుతున్న టీడీపీ నిన్న ఎంతమంది కంచాలు కొట్టారో తెలుసా? అని ప్రశ్నించారు. టీడీపీ ఇచ్చిన పిలుపుకు ఏమాత్రం కార్యకర్తలే స్పందన లేదన్నారు. నిజంగా కోటి సభ్యత్వం ఉంటే నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక మోత మోగుండాల్సినందని అభిప్రాయపడ్డారు. జనం సొమ్ము చంద్రబాబు నొక్కేశారని భావించే ఎవరూ విజిల్స్ వేయడానికి ముందుకు రాలేదని పేర్ని నాని అన్నారు.
జగన్పై పెట్టిన కేసులు...
నాడు జగన్ పై పెట్టిన కేసులు అక్రమమని జనం నమ్మారన్నారు. అందుకే అంతటి మెజారిటీ వైసీపీకి లభించిందన్నారు. అక్రమ కేసులు అయితే కోర్టుల్లో బాబుకు అనుకూలంగా తీర్పులు ఎందుకు రావడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ పై పెట్టిన ప్రతి కేసూ ఒక్కొక్కటీ తేలిపోతున్నాయన్నారు. ఒకరోజు ఆలస్యమయినా జగన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పెట్టిన కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారని నాని అన్నారు. జన్మనిచ్చిన కన్నతండ్రి జైల్లో ఉంటే 20 రోజుల నుంచి ఢిల్లీలో ఏం చేస్తున్నాని లోకేష్ పై విమర్శలు చేశారు.
Next Story