Mon Dec 23 2024 11:26:12 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వల్లనే సర్వనాశనం
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థను జగన్ సర్వనాశనం చేశాడన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థను జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. ప్రధమ స్థానంలో ఉండాల్సిన విద్యావ్యవస్థను అథమ స్థాయికి చేర్చారని తెలిపారు. ఉమెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో దేశంలోనే పదో స్థానంలో ఉన్నామన్నారు. విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటి పోయాయని అసర్ నివేదిక వెల్లడించిందని యనమల రామకృష్ణుడు తెలిపారు.
డ్రాప్ అవుట్స్ ....
ప్రభుత్వం అసమర్థత కారణంగా పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయని యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనల కోసం స్కూలు బస్సులను బలవంతంగా తీసుకుంటున్నారని అన్నారు. ఉపాధ్యాయుల చేత మద్యాన్ని అమ్మించిన హీనమైన చరిత్ర జగన్ ది అని యనమల ఫైర్ అయ్యారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ జరుపుతామని మాట ఇచ్చిన జగన్ ఒక్క డీఎస్సీని కూడా ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. విదేశీ విద్యను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story