Mon Dec 23 2024 20:16:26 GMT+0000 (Coordinated Universal Time)
గ్రీన్ పేపర్ విడుదలకు యనమల డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్థిక అసమానతలు కూడా పెరిగిపోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అసమానతలు38 నుంచి 43 శాతానికి పెరిగాయన్నారు. ప్రభుత్వ విధానాల వల్లనే ఈ దుస్థితి దాపురించిందని యనమల అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్థిక క్రమ శిక్షణ....
ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా లోపించిందన్నారు. అప్పులు చేసి మరీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దిగజార్చారని యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ అప్పులు చేస్తుందని, ఇదే రకమైన పరిస్థితి కొనసాగితే భవిష్యత్ అంధకారమవుతుందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story