Mon Dec 23 2024 08:02:01 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యన్న ఇంటి ఘటనపై యనమల సీరియస్
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి కూల్చివేతలు సిగ్గుచేటన్నారు. అక్రమ కట్టడాలు అంటూ ఇంటి గోడలు కూల్చి వేసి జగన్ రెడ్డి బీసీలపై కక్ష సాధిస్తున్నారన్నారు. ముసుగు వేసుకుని ఒక వ్యక్తి ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని, ఇంట్లో నోటీసులను విసిరి వేశారని యనమల రామకృష్ణుడు అన్నారు.
తుగ్లక్ పాలన...
తెల్లవారు జామున ఈ కూల్చివేతలకు పాల్పడాల్సిన అవసరం లేదని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రెండు రోజుల క్రితం మినీ మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన తాడేపల్లిలోని తుగ్లక్ కు మాత్రమే వస్తాయని మరోసారి నిరూపణ అయిందని యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ తుగ్లక్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని యనమల పిలుపునిచ్చారు.
Next Story