Mon Dec 23 2024 16:11:30 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ దిగిపోవడం ఖాయం... యనమల జోస్యం
అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ ను జగన్ అన్ని రకాలుగా సంక్షోభంలోకి నెట్టారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు
అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ ను జగన్ అన్ని రకాలుగా సంక్షోభంలోకి నెట్టారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి జగన్ నెట్టేశారన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికే పతనం అంచున ఉందని, త్వరలోనే జగన్ కూడా దిగిపోవడం ఖాయమని యనమల అభిప్రాయపడ్డారు. మంత్రి వర్గ విస్తరణ పేరుతో అందరినీ మార్చేస్తే సమస్యలు సమసిపోతాయా? అని యనమల ప్రశ్నించారు.
ఎందుకు విస్తరణ?
విద్యుత్ కోతలు, దోపిడీ, దౌర్జన్యాలతో ఏపీకి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రారన్నారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులను మారుస్తున్నారా? లేక గతంలో కంటే బూతులు బాగా తిట్టే వారి కోసం విస్తరణను చేపట్టారా? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మంత్రి వర్గ విస్తరణ పేరుతో సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందన్నారు. విస్తరణ వల్ల ప్రజలకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని చెప్పారు.
Next Story