Mon Dec 23 2024 09:59:09 GMT+0000 (Coordinated Universal Time)
కన్నా వస్తే నాకెందుకు అభ్యంతరం?
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వచ్చినా తనకు రాజకీయంగా ఇబ్బంది లేదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు.
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వచ్చినా తనకు రాజకీయంగా ఇబ్బంది లేదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణతో తనకు వ్యక్తిగత శతృత్వమేమీ లేదని ఆయన తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణను గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి సపోర్లు ఇచ్చారన్నారు. పెదకూరపాడులో కన్నా తాను కలసి పోటీ చేశామన్న రాయపాటి చేబ్రోలు హనుమయ్య కన్నా లక్ష్మీనారాయణను రాజకీయంగా ప్రోత్సహించారని చెప్పారు.
కలసి పనిచేస్తాం...
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎవరికి సీటు ఇచ్చినా కలసి పనిచేస్తామని రాయపాటి సాంబశివరావు తెలిపారు. తాను కూడా కన్నాకు మద్దతిస్తామనని ఆయన చెప్పారు. టీడీపీలో చేరితే తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే కన్నాతో కలసి పనిచేయడానికి సిద్ధమని అన్నారు. ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుందని, తనకు ఉండేది తనకు ఉంటుందని రాయపాటి సాంబశివరావు మీడియా ఎదుట వ్యాఖ్యానించారు.
Next Story