Fri Nov 22 2024 23:28:12 GMT+0000 (Coordinated Universal Time)
సీఐడీకి మార్గదర్శి సమాచారం : ఉండవల్లి
మార్గదర్శి చిట్‌ఫండ్స్ లో తప్పు జరిగిందా లేదా అనేది తేలాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ లో తప్పు జరిగిందా లేదా అనేది తేలాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి చిట్స్ గతంలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చిన సమాచారాన్ని తాను సీఐడీ అధికారులకు పంపుతున్నానని తెలిపారు. మార్గదర్శి పై ఎవరూ ఫిర్యాదు చేయలేదని అనడం సరికాదన్న ఉండవల్లి, మార్గదర్శి లో డబ్బులు ఎగ్గొట్టారని తాను ఎప్పుడూ అనలేదన్నారు. డిపాజిట్లు సేకరణ చట్టవిరుద్ధం అంటున్నానే తప్ప డబ్బులు ఎగ్గొట్టారని తాను ఆరోపణ చేయలేదన్నారు. రామోజీరావుది 15వేల కోట్ల రూపాయల సంస్థానమని, రామోజీకి శిక్ష పడాలని తాను కోరుకోవడం లేదని, తప్పు జరిగిందా లేదా అని తేలాలన్నదే తన ఉద్దేవ్యమని ఉండవల్లి పేర్కొన్నారు.
ఏడేళ్లు శిక్ష...
తాను మార్గదర్శిపై కేసు వేసిన సమయంలో 15 ఏళ్ల క్రితం మార్గదర్శికి చెందిన రాజాజీ అనే వ్యక్తి " మార్గదర్శికీ రామోజీకి సంబందమే లేదని" కోర్టులో అఫిడవిట్ వేశాడన్నారు. ఇప్పుడు అదే రాజాజీ అనే వ్యక్తి "మార్గదర్శి చైర్మన్ రామోజీరావు అని, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ అని కోర్టులో మరొక అఫిడవిట్ వేశాడన్నారు. ఆసలు ఎలా ఇలా పిటిషన్లు వేస్తారో తనకు అర్ధం కావడం లేదన్నారు ఉండవల్లి అరుణ్న కుమార్. గతంలో రామోజీకి, మార్గదర్శికి సంబందమే లేదని రాజాజీ చేత పిటిషన్ వేయించారుకదా ? ...ఇప్పుడు మార్గదర్శి మీదే .. అని ఎందుకు ఆయన చేత ఎందుకు పిటిషన్ వేయిస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. కోర్టులో తప్పుడు అఫిడవిట్ వేసినందుకు ఐపీసీ సెక్షన్ 193 ప్రకారం ఏడేళ్లు శిక్ష పడే అవకాశముందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
Next Story